AKP: నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ (NWC) అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా గొంతిన భక్త సాయిరామ్ ఆదివారం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నవ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల్లో అవగాహన పెంపు, సామాజిక అడవుల అభివృద్ధికి కృషి చేస్తానని సాయిరామ్ తెలిపారు.