KDP: జిల్లా కాశీనాయన మండలం చిన్నాయపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(60) బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో వర్షంతో పాటు పిడుగు పడింది. ఈ క్రమంలో నారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ పెద్ద కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.