HDFC బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్ చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పరిణామాలు, పద్ధతులు తన వ్యక్తిగత నైతిక విలువలకి విరుద్ధంగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో RBI వెంటనే స్పందించి, ఆయన స్థానంలో మిస్త్రీని మూడు నెలల పాటు తాత్కాలిక చైర్మన్గా నియమించింది. చక్రవర్తి హఠాత్తుగా తప్పుకోవడం బ్యాంకింగ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.