PLD: ఏపీ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మాచర్ల నియోజకవర్గంలో శనివారం సంబరాలు నిర్వహించారు. వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు “జై అమరావతి” నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.