KDP: వల్లూరు, కమలాపురం ప్రాంతాల్లోని పలు హోటళ్లపై సివిల్ సప్లై అధికారులు బుధవారం అకస్మిక దాడులు నిర్వహించారు. గృహ వినియోగానికి కేటాయించిన LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు 6(a) EC చట్టంకింద 4 కేసులు నమోదు చేసి, 13గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.