తూ.గో: రాజమండ్రికి చెందిన హోంగార్డు కుడుపూడి వీర వెంకట సత్యనాగ మురళీకృష్ణను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది. 2024-28 కాలానికి ప్రకటించిన అవార్డుల్లో ఆయనకు చోటు దక్కింది. రెండు దశాబ్దాలుగా చూపుతున్న నిబద్ధత, అంకితభావానికి ఈ గౌరవం లభించింది. త్వరలో జరిగే కార్యక్రమంలో ఆయన పురస్కారం అందుకోనున్నారు.