TG: హైదరాబాద్ నగరంలో మార్చి 27న జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి గోషామహల్ MLA రాజాసింగ్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. శోభాయాత్రకు పోలీసు భద్రత వద్దంటూ పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసు భద్రత పేరుతో గతంలో భక్తులపై లాఠీచార్జీలు జరిగాయని, భక్తులను ఇబ్బందులకు గురిచేసే రక్షణ తమకు అవసరం లేదని స్పష్టం చేశారు.