TG: రైతులు కేవలం వరి పంట వైపే కాదు.. పామాయిల్ పంట వైపు మొగ్గు చూపాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల రైతులు పామాయిల్ పంట వేయాలని సూచించారు. దీంతో భారీ లాభాలు గడించవచ్చని చెప్పారు.