MLG: జిల్లాలో ‘మన ఇసుక వాహనం’ స్కీం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు. దీంతో 10 మండలాల్లోని ప్రజలు, ఇందిరమ్మ ఇండ్లకు కనిష్ట ధరకు నేరుగా ఇసుక సరఫరా చేరునట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇంటి వద్దే బుక్ చేసుకోవచ్చన్నారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, పారదర్శకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక పంపిణీ చేస్తామన్నారు.