SDPT: జగదేవ్పూర్ మండలంలోని పలుగుగడ్డ గ్రామంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ కనుకయ్య ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పండితులు గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర రాశిఫలాలు, ఆదాయ-వ్యయ సూచనలు, గ్రహగతులను వివరించారు.