TG: సంగారెడ్డి రామాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దఎత్తున పేలాల లడ్డూ వేడుకలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి నిర్వహించారు. జనాలపైకి పేలాల లడ్డూలు భారీగా విసిరారు. వాటిని అందుకుంటే అంతా మంచే జరుగుతుందని ప్రజల నమ్మకం. భజనలు, పాటలతో భక్తుల్లో జగ్గారెడ్డి ఉత్సాహం నింపారు.