కోనసీమ: ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండుగ రంజాన్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కొత్తపేట కమ్మిరెడ్డి పాలెం మసీదులో గురువారం ఏర్పాటు చేసిన ఇప్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యానికి, సామాజిక ఐక్యతకు ప్రతీక ఇప్తార్ అని కొనియాడారు.