SRD: ఖేడ్ మండలం పరిధిలోని హనుమంతరావుపేట గ్రామంలో గురువారం జరిగిన శ్రీ వెంకటేశ్వర జాతర మహోత్సవాల్లో ఎడ్ల బండ్ల ప్రదర్శన ఘనంగా జరిగింది. అనాదిగా వస్తున్న ఆనవాయితీగా రైతులు ఎడ్లు, బండ్లకు అందంగా అలంకరించి గ్రామంలో నుంచి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం చేరుకొని శ్రీవారి ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు వేసి మొక్కులు తీర్చుకున్నారు.