JGL: జగిత్యాలలోని మాజీమంత్రి జీవన్ రెడ్డి నివాసంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మశ్రీ చంద్రశేఖర్ శర్మ పంచాంగాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి దంపతులతో పాటు కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.