NZB: 10వ తరగతి పరీక్షల్లో భాగంగా నిన్న బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశ్నా పత్రం లీక్ ఘటనకు సంబంధించి విచారణ పూర్తి అయ్యిందని DEO అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో లీక్ అవాస్తవమని తేలిందన్నారు. ఈ మేరకు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ కె.వేణు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఏ. శివానంద్ రావుపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు DEO తెలిపారు