KMR: జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగ పెన్షనర్లు ఈ నెల 25వ తేదీని “పెన్షన్ బ్లాక్ డే”గా పాటించాలని గురువారం SGPAT జిల్లా అధ్యక్షులు హనుమంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (AISPF), న్యూ ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ జేఏసీ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.