TG: తాను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంలో పర్యటించానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అప్పుడు ఆయిల్ పామ్ పంటను మురిసిపోయాయనని అన్నారు. అయితే సిద్ధిపేటలో గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నందున ఆయిల్ పామ్ పంటకు అనుకూలం కాదని శాస్త్రవేత్తలు అన్నారని.. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టిన జలాశయాల వల్ల సిద్దిపేట ప్రాంతంలో గాలిలో తేమశాతం పెరిగిందన్నారు.