TG: ఆయిల్ పామ్ పెట్టిన రైతుల అకౌంట్లో కేంద్రం ఎకరాకు రూ.4,500 వేస్తోందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. రైతులు విత్తనాలు కొన్నప్పటి నుంచి ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తోందన్నారు. ఎవరికైనా డబ్బులు రాకపోతే.. ఆయిల్ పామ్ మార్కెట్ ఫెడరేషన్ అధికారులు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు.