KRNL: పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలను ఆదుకుంటున్నామని మంత్రి టీజీ భరత్ చెప్పారు. బుధవారం కర్నూలులోని మంత్రి కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 33 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మొత్తం 170 మందికి రూ.1,53,03,688 అందించినట్లు తెలిపారు.