గుంటూరు నగరపాలక సంస్థలో అక్రమ కట్టడాలకు సహకరించిన 8 మంది టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగినట్లు విచారణలో తేలింది. శారద, వెంకటరావమ్మ, రిజ్వానా, మల్లికార్జున, సురేఖ, హరిజానాయక్, అశోక్ కుమార్, సత్యనారాయణలపై AP సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టనున్నారు.