తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పరాభవ నామ సంవత్సరం పేరిట ఉగాది ముందుకొస్తోందని పేర్కొన్నారు. పెద్దల మాట పాటిస్తూ జాగ్రత్త వహించటమే మన విధి అని, ఉగాది తెలుగు వారందరికి ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సమృద్ధిగా వానలు కురిసి.. పంటలు బాగా పండి.. రైతులకు మేలు కలగాన్నారు.