CTR: పుంగనూరు పట్టణం నడిబొడ్డున కొలువైయున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారి మూలవర్లకు అభిషేకించి పసుపు, కుంకుమ, సింధూరం, గంధం, వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.