NDL: నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈనెల 24న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు పోటీలు జరుగుతాయి. ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.