పరాభవ నామ సంవత్సరంలో ప్రతిఒక్కరికీ అన్నీ శుభాలే జరగాలని ప్రముఖ నటుడు చిరంజీవి ఆకాంక్షించాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని SM వేదికగా అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. అధర్మం, అహంకారాలకు.. ధర్మం చేతిలో పరాభవం జరిగి.. శాంతి, స్నేహం, ప్రేమ జయించాలని కోరాడు. అలాగే ప్రముఖ హీరో అల్లు అర్జున్తో పాటు పలువురు సినీ ప్రముఖులు అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.