ప్రకాశం: ఉగాది సందర్భంగా కొండపి మండలం జాళ్ళపాలెంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారిని రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, కార్యనిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరునాళ్లలో ఏర్పాటుచేసిన అన్నప్రసాద సత్రాన్ని, చలివేంద్రములను సందర్శించారు.