AP: జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా ఏపీ చాలా నష్టపోయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 20 నెలల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ వయసులో కూడా సీఎం చంద్రబాబు కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు.