TG: HYD నారపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సిరిసిల్లకు చెందిన విద్యార్థిని నందిని.. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు స్వగ్రామానికి తరలించనున్నారు.