SDPT: కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇవాళ నంగునూరు మండల పర్యటనలో భాగంగా కాళేశ్వరం కాలువ వద్ద ఆగి ఆయన సెల్ఫీ తీసుకున్నారు. గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిందని, అపర భగీరథుడు కేసీఆర్ కృషితో వేసవిలోనూ రైతుల కళ్లలో ఉత్సాహం కనిపిస్తోందని హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు.