MBNR: తెలంగాణ శాసనసభ విప్‌గా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణారావు ఓ సర్కులర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు.