BPT: రేపల్లె మండలం పేటేరులో టీడీపీ నేతలు పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేనేత మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను నేటి నుంచే అమలు చేస్తోందని వివరించారు. కార్మికులపై ఆర్థిక భారం తగ్గించడమే ధ్యేయమన్నారు.