MBNR: కౌకుంట్ల మండలంలోని ఇస్రంపల్లి గ్రామంలో మహిళా మండల భవన నిర్మాణానికి మండల పార్టీ అధ్యక్షులు మాది రెడ్డి రాఘవేందర్ రెడ్డి, సర్పంచ్ గొల్ల కృష్ణయ్య భూమి పూజ చేశారు. వారు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు మెరుగైన పాలన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా, గ్రామ పరిపాలన మరింత పారదర్శకంగా, ప్రజలకు చేరువగా ఉండేలా ఈ నూతన భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.