VKB: దౌల్తాబాద్‌లోని గోకాఫసల్వాద్ పయనీర్ పాఠశాల విద్యార్థి సబావత్ గౌతమ్ నవోదయ విద్యాలయ – 2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ చాటారు. ఎల్.జి. తండాకు చెందిన గౌతమ్ 6వ తరగతి ప్రవేశానికి ఎంపికయ్యారు. 90/100 మార్కులతో జిల్లా స్థాయిలో 33వ ర్యాంకు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు గౌతమ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.