PDPL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని , ఓదెల మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వాహనదారులు తమ వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. కొత్త సంవత్సరంలో శుభాలు కలగాలని భక్తులు ఆకాంక్షించారు.