MDK: పెద్ద శంకరంపేట రామాలయంలో మధ్యాహ్నం పంచాంగ శ్రవణం పఠించారు. ఆలయ పూజారి మహేష్ శర్మ పంతులు ఉగాది విశిష్టతను, ఈ సంవత్సరం పంచాంగం, రాశుల వారిగా వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, ఎస్సై ప్రవీణ్ రెడ్డి, మురళి పంతులు, రాగం సిద్దేశ్వర్, శ్రీనివాస్, గంగారెడ్డి, కందుకూరి రవీందర్, సుభాష్ గౌడ్, ఆర్ఎన్ సంతోష్ కుమార్, దస్వంత్ పాల్గొన్నారు.