NGKL: ముంపు బాధితుల పోరు ఆగడం లేదు. తమ నివాసాలు రిజర్వాయర్లో కలవకూడదని, ప్యాకేజీ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని ఎర్రవల్లి, తండా ప్రజలు చేపట్టిన దీక్షలు ఇవాళ్టితో 108వ రోజుకు చేరాయి. లోకమంతా ఉగాది వేడుకల్లో మునిగితేలగా, బాధితులు మాత్రం పండుగను బహిష్కరించి దీక్షా శిబిరంలోనే గడిపారు. అధికారులు స్పందించి తమ గ్రామాల మనుగడను కాపాడాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.