AP: ఉగాది రోజు రాష్ట్ర యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. నిర్దేశిత సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను అర్థం చేసుకుంటోందని చెప్పారు. ఈ 20 నెలల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు.