KRNL: మంత్రాలయం మండలం మాధవరంలో ఆంధ్ర కర్ణాటక సరిహద్దు చెక్పోస్ట్ వద్ద కర్ణాటక నుంచి ఆంధ్రాకు రవాణా చేస్తున్న కర్ణాటక మధ్యాన్ని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ప్రసాద్ రావు తెలిపారు. కోడుమూరుకు చెందిన సురేశ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రాంతం గిలికే సుగుర్ నుంచి 96 విస్కీ టెట్రా ప్యాకెట్లను తీసుకెళ్తుండగా గుర్తించామన్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.