PPM: బామిని మండలం తహసీల్దార్ శివన్నారాయణను తక్షణమే సస్పెండ్ చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. వీఆర్ఏలను తహసీల్దార్ తన ఇంటీ, సొంత పనులకు వాడు కోవడం, దూషణలు చేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికే తహసీల్దార్ పై అనేక ఫిర్యాదులు నమోదు అయ్యాయని అన్నారు.