AP: మచిలీపట్నం బచ్చుపేట వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్షించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఉగాది వేడుకలను భక్తులతో కలిసి నిర్వహించుకోవడం అత్యంత సంతోషంగా ఉందన్నారు.