AP: నేషనల్హైవే 65పై అధికారులతో ఎంపీ కేశినేని చిన్ని సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను NH అధికారులకు తెలిపామని ఎంపీ చెప్పారు. బైపాస్‌ను వెడల్పు చేయాలంటే చాలా ఇళ్లు పోతున్నాయని.. తాము చెప్పిన వినతులను అధికారులు అంగీకరించలేదని పేర్కొన్నారు.