NRPT: మద్దూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పనులు నెలలు గడిచినా పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలంలో టైల్స్ వేయకపోవడంతో వాహనాలు రోడ్డుపైనే నిలిపడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. డివైడర్లు నిర్మించి వదిలేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్, ప్లాంటేషన్ పనులు కూడా నిలిచిపోయాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.