SRD: ఖేడ్ మండలం లింగాపూర్‌లో కొత్తగా మురికి కాలువల నిర్మాణం కోసం నేడు స్థానిక కాలనీవాసులతో కలిసి సర్పంచ్ భూమి పూజ చేశారు. స్థానిక దుర్గా భవాని మాత ఆలయం నుంచి కొత్తగా సీసీ మోరి నిర్మిస్తున్నట్లు సర్పంచ్ రుక్మిణి హనుమాన్లు చెప్పారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.