అనకాపల్లి పట్టణం గవరపాలెం వీ.వీ. రమణ రైతు భారతిలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అర్చక ఎగ్జామినర్ రేజేటి గోప అప్పలాచార్యులు రాశి ఫలాలను తెలియజేశారు. పరాభవ నామ సంవత్సరం వ్యవసాయానికి, పరిశ్రమలకు అనుకూలం అన్నారు. అనంతరం పంచాంగం పుస్తకాలను పంపిణీ చేశారు.