NDL: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 25న నంద్యాలలోని ఎన్టీఆర్ షాదీ ఖానాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ మేళాలో 13 కంపెనీలు పాల్గొని, సుమారు 920 ఉద్యోగాలు కల్పించనున్నాయని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో DSDO శ్రీకాంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.