AP: పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఐశ్వర్యం, ఆనందాన్ని తెస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఉగాది రోజు గ్రామ దేవతలకు సారె సమర్పించాలని రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.