AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్నూలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, పోలవరం, మన్యం, కోనసీమ, అనంతపురం, చిత్తూరు, సత్యసాయి తదితర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.