ASR: అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో వాతావరణం గత రెండు రోజులుగా చిత్ర విచిత్రంగా మారుతోంది. ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచుతో మొదలైన రోజు, మధ్యాహ్నానికి ఎండ సెగలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత అరకులోయ, డుంబ్రిగుడల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.