TG: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మ.2 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ హాల్లో ఈ భేటీ నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను ఎలా తిప్పికొట్టాలి, ప్రభుత్వ ప్రాధాన్యతలను సభలో ఎలా చాటిచెప్పాలనే అంశంపై సీఎం రేవంత్ MLAలు, MLCలకు దిశానిర్ధేశం చేయనున్నారు.