AP: రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ వచ్చే నెల 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని ‘సర్’ బీజేపీ రాష్ట్ర కన్వీనర్, ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. దీనిపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే బీజేపీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించినట్లు చెప్పారు.