AP: నంద్యాల(D) కొత్తపల్లి(M) సంగమేశ్వర గర్భాలయం కృష్ణానది జలాల నుంచి బయటపడుతోంది. శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం 843.70 అడుగులకు చేరడంతో ఆలయ ప్రహరీ భాగం కింది వరకు నీరు తగ్గుముఖం పట్టాయి. మరో 5 అడుగులు నీరు తగ్గితే ఆలయం పూర్తిగా బయటపడుతుందని అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. త్వరలోనే ఆలయంలోని వేపాదారు శివలింగ దర్శన భాగ్యం లభించే అవకాశం ఉందని ఆయన వివరించారు.